Advertisement

  • కొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉంది... ఇంతలో పెళ్లి కూతురి ఇంటి పైకప్పు కూలడంతో వధువు...!

కొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉంది... ఇంతలో పెళ్లి కూతురి ఇంటి పైకప్పు కూలడంతో వధువు...!

By: Anji Fri, 18 Dec 2020 3:38 PM

కొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉంది... ఇంతలో పెళ్లి కూతురి ఇంటి పైకప్పు కూలడంతో వధువు...!

మరికొన్ని గంటల్లో ఆ వధువు మెడలో మూడు ముళ్లుపడాల్సివుంది. ఇంతలో వధువు ఇంట విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలిపోయింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లి కూతురి ఇంటి పైకప్పు కూలడంతో వధువు తీవ్రంగా గాయపడింది.

దీంతో ఆమె వెన్నెముక, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో వధువు ఆర్తిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు.

అయినప్పటికీ, పెద్ద మనసున్న పెళ్లి కొడుకు ఆర్తిని అనుకున్న ముహూర్తానికే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఆర్తి గాయాలతో మంచంపై ఉన్నప్పటికీ పెద్దలు పెళ్లి చేశారు.

ఆసుపత్రి వైద్యులు కూడా వారి పెళ్లికి అభ్యంతరాలు చెప్పలేదు. పెళ్లికొడుకు అవధేశ్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసించారు.

ఇటువంటి కష్ట సమయంలో పెళ్లి కూతురికి తాను మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని అవధేశ్ అన్నాడు. ఈ పరిస్థితి వచ్చినందుకు తాను భయపడ్డానని పెళ్లి కూతురు ఆర్తి చెప్పింది. అయితే, వరుడు తనకు అండగా నిలిచాడని, తాను గాయాలపాలైనా పెళ్లి చేసుకున్నాడని ఆర్తి తెలిపింది.

Tags :

Advertisement