Advertisement

  • Breaking News: తాళికట్టు శుభవేళ వరుడికి షాక్ ఇచ్చింది ఓ వధువు...!

Breaking News: తాళికట్టు శుభవేళ వరుడికి షాక్ ఇచ్చింది ఓ వధువు...!

By: Anji Sun, 01 Nov 2020 4:16 PM

Breaking News: తాళికట్టు శుభవేళ వరుడికి షాక్ ఇచ్చింది ఓ వధువు...!

తాళికట్టు శుభవేళ వరుడికి షాక్ ఇచ్చింది ఓ వధువు. తమిళనాడు నీల్గిరిస్లోని మట్టకండి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 'నా ప్రియుడు నా కోసం వస్తాడు. ఈ పెళ్లి నాకొద్దు' అని వరుడు తాళి కట్టే సమయంలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

కరోనా నిబంధనల దృష్ట్యా.. కొద్ది మంది బంధువుల సమక్షంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇరువురి కుటుంబ సభ్యులు. అక్టోబర్ 29న ముహూర్తం పెట్టుకున్నారు.

కానీ చివరి నిమిషంలో వధువు, తనకు ఈ పెళ్లి వద్దంటూ కుటుంబ సభ్యులను, వరుడిని ఒప్పించే ప్రయత్నం చేసింది. తన ప్రియుడు వస్తున్నాడని చెప్పి పెళ్లి మండపం నుంచి లేచి వెళ్లిపోయింది.


కూతురు ప్రేమను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు.. వధువును తన ప్రియుడికి అప్పగించారు. ఎట్టకేలకు తన ప్రేమను దక్కించుకుంది ఆ వధువు.

Tags :
|
|

Advertisement