Advertisement

  • సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయాల్సింద‌ని చెప్పిన బ్రియాన్ లారా

సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయాల్సింద‌ని చెప్పిన బ్రియాన్ లారా

By: chandrasekar Tue, 24 Nov 2020 10:37 AM

సూర్య‌కుమార్ యాద‌వ్‌ను  ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయాల్సింద‌ని చెప్పిన బ్రియాన్ లారా


ముంబై ఇండియ‌న్స్ టీంలో అద్భుతంగా బాటింగ్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయాల్సింద‌ని బ్రియాన్ లారా చెప్పుకొచ్చారు. ఐపీఎల్ 2020 ‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయాల్సింద‌ని వెస్టిండీస్ మాజీ దిగ్గ‌జ క్రికెట‌ర్ బ్రియాన్ లారా అన్నాడు. ఒత్తిడిలో ఆడే సామ‌ర్థ్యం అత‌ని సొంత‌మ‌ని, అత‌డో క్లాస్ ప్లేయ‌ర్ అని చెప్పడానికి తాను ఏమాత్రం సందేహించ‌న‌ని లారా స్ప‌ష్టం చేశాడు. చాలా అద్భుతంగా బాటింగ్ చేసాడని చెప్పుకొచ్చాడు.

సూర్య‌కుమార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 77 మ్యాచ్‌లు ఆడి 44 స‌గ‌టుతో 5326 ప‌రుగులు, 165 టీ20ల్లో 32.33 స‌గ‌టుతో 3492 ప‌రుగులు చేశాడు. ఐపీఎల్‌లో ముంబై త‌ర‌ఫున కీల‌క ఇన్నింగ్స్ ఎన్నో ఆడాడు. అత‌డి ఫామ్ చూసిన వాళ్లంతా ఆస్ట్రేలియా టూర్‌కు కచ్చితంగా ఎంపిక అవుతాడ‌ని భావించారు. అయితే సెల‌క్ట‌ర్లు మాత్రం అత‌నికి మొండిచేయి చూపించారు. అలాంటి క్లాస్ ప్లేయ‌ర్ క‌చ్చితంగా ఆస్ట్రేలియా టూర్‌కు ఉండాల్సింద‌ని లారా కూడా అంటున్నాడు. అత‌డో క్లాస్ ప్లేయ‌ర్‌. నేను కేవ‌లం ప‌రుగులు మాత్ర‌మే చేసే ప్లేయ‌ర్స్‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోను.

కానీ మ్యాచ్ లో వాళ్ల టెక్నిక్‌, ఒత్తిడిలో ఆడే సామ‌ర్థ్యం, వాళ్లు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నారో కూడా చూస్తాను. ఆ లెక్క‌న ముంబై త‌ర‌ఫున సూర్య‌కుమార్ అద్భుతంగా ఆడాడు అని లారా ప్ర‌శంస‌లు కురిపించాడు. ఏ టీమ్‌లో అయినా బెస్ట్ ప్లేయ‌రే మూడో స్థానంలో వ‌స్తాడ‌ని, త‌న దృష్టిలో సూర్య‌కుమార్ కూడా ముంబై టీమ్‌కు అలాంటి వాడేన‌ని లారా అభిప్రాయ‌ప‌డ్డాడు. అయినా అతనిని ఎందుకు టీమిండియాకు ఎంపిక చేయ‌లేదో అర్థం కావ‌డం లేద‌ని అన్నాడు. అతను కూడా ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయనందున తీవ్ర నిరాశకు లోనయ్యాడు.

Tags :

Advertisement