Advertisement

  • ఫ్లాష్ న్యూస్ ..భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ - విజయవాడ మధ్య రాకపోకలు బంద్

ఫ్లాష్ న్యూస్ ..భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ - విజయవాడ మధ్య రాకపోకలు బంద్

By: Sankar Tue, 13 Oct 2020 9:23 PM

ఫ్లాష్ న్యూస్ ..భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ - విజయవాడ మధ్య రాకపోకలు బంద్


తీవ్ర వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం కారణంగా రెండ్రోజులపాటు మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

తెలంగాణలోనూ పలు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై నీరు నిలిచిపోయింది. పంట పొలాలు నీట మునిగాయి. హైదరాబాద్‌లో మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

అయితే అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఇనాంగూడ వద్ద విజయవాడ జాతీయ రహదారి పై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా కార్లు అన్నీ మునిగిపోయాయి. దీంతో విజయవాడ నుండి హైదరాబాద్ కు రాకపోకలు బంద్ అయ్యాయి.

Tags :
|

Advertisement