Advertisement

ఏపీలో సినిమా థియేటర్ల రీ ఓపెనింగ్ కు బ్రేక్

By: Sankar Wed, 14 Oct 2020 5:17 PM

ఏపీలో సినిమా థియేటర్ల రీ ఓపెనింగ్ కు బ్రేక్


కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 5.0 గైడ్ లైన్స్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ గైడ్ లైన్స్ లో సినిమా హాల్స్ కు మల్టీ ప్లెక్స్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం.

లాక్ డౌన్ కారణంగా దాదాపు ఏడూ నెలలుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇక కేంద్రం ఇచ్చిన అనుమతితో అక్టోబర్ 15 నుంచి సినిమా హాల్స్ , మల్టీ ప్లెక్స్ లు రీఓపెన్ కానున్నాయి. అయితే..ఏపీలో మాత్రం థియేటర్ల రీ-ఓపెనింగ్ కు బ్రేక్ పడింది. ఏపీకి చెందిన 13 జిల్లాల సినిమా ఎగ్జిబిటర్లు ఇవాళ విజయవాడలో సమావేశం అయ్యారు. గురువారం నుంచి సినిమా థియేటర్లు తెరవాలా..వద్దా అన్నదానిపై చర్చలు జరిపారు.

చివరికి రేపటినుంచి థియేటర్లు తెరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లు తెరవాలంటే ఒక్కో దానికి రూ. 10 లక్షల అదనపు ఖర్చు అవుతుందని, 50 శాతం ఎక్కుపెన్సీ తో థియేటర్ల నిర్వహణ కష్టమని ఎగ్జిబిటర్లు భావించి..ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫిక్స్డ్ విద్యుత్ చార్జీలు ఎత్తివేయాలని ఎగ్జిబిటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tags :
|
|

Advertisement