Advertisement

  • కరోనా వ్యాక్సిన్ అవసరంలేకుండానే అంతం అవుతుంది ...బ్రెజిల్ అధ్యక్షుడు

కరోనా వ్యాక్సిన్ అవసరంలేకుండానే అంతం అవుతుంది ...బ్రెజిల్ అధ్యక్షుడు

By: Sankar Fri, 27 Nov 2020 5:10 PM

కరోనా వ్యాక్సిన్ అవసరంలేకుండానే అంతం అవుతుంది ...బ్రెజిల్ అధ్యక్షుడు


ప్రపంచంలో అమెరికా ఇండియా తరువాత అత్యధిక కేసులు నమోదవుతున్న దేశం బ్రెజిల్. అత్యధిక మరణాల విషయానికి వస్తే అమెరికా తరువాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నది. కరోనా వైరస్ కట్టడి విషయంలో ఆ దేశ అధ్యక్షుడు బొల్సోనారో సంచలన వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ తీవ్రత దేశంలో పెద్దగా లేదని, కరోనా వ్యాక్సిన్ తో అవసరం లేకుండానే వైరస్ మహమ్మారి అంతం అవుతుందని అన్నారు. అధ్యక్షుడికి ఇప్పటికే కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా అయన ఈ విధంగా మాట్లాడటం ఆశ్చర్యాన్ని ఇస్తోంది.

కరోనా కట్టడి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అమెజాన్ అడవుల్లోని మారుమూల ప్రాంతాలకు సైతం కరోనా పాకింది. ప్రజలు కరోనా భయంతో ఆందోళన చెందుతున్నారు. అధ్యక్షుడు మాత్రం కరోనా వైరస్ గురించి పెట్టించుకోకుండా మాట్లాడుతున్నారు. తనకు కరోనా వ్యాక్సిన్ అక్కర్లేదని, దేశంలోని ప్రజలు కూడా వ్యాక్సిన్ తీసుకోబోరని బొల్సోనారో పేర్కొన్నారు.

Tags :
|

Advertisement