Advertisement

  • కరోనా వ్యాక్సిన్ పై వ్యంగ్య వాఖ్యలు చేసిన బ్రెజిల్ ప్రెసిడెంట్ బొల్సొనారో

కరోనా వ్యాక్సిన్ పై వ్యంగ్య వాఖ్యలు చేసిన బ్రెజిల్ ప్రెసిడెంట్ బొల్సొనారో

By: Sankar Sun, 20 Dec 2020 11:17 AM

కరోనా వ్యాక్సిన్ పై వ్యంగ్య వాఖ్యలు చేసిన బ్రెజిల్ ప్రెసిడెంట్ బొల్సొనారో


ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కొద్దిగా తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తుంది...మరోవైపు కరోనా వ్యాక్సిన్ పంపిణి కూడా వివిధ దేశాలలో జరుగుతుంది..అయితే కరోనా ధోరణిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సొనారో మరోమారు తన వ్యంగ్య ధోరణిని ప్రదర్శించారు.

బ్రెజిల్‌లో భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించిన ఆయన.. ఫైజర్‌ ఇచ్చిన కాంట్రాక్టులో స్పష్టంగా కంపెనీ ఏ సైడ్‌ ఎఫెక్ట్స్‌కు బాధ్యత వహించదని ఉందని, అందువల్ల టీకా తీసుకున్న తర్వాత ఎవరైనా మొసలిగా మారితే అది వారి సమస్యని హెచ్చరించారు.

వ్యాక్సిన్‌ తీసుకున్నవాళ్లు సూపర్‌ హ్యూమన్‌గా మారినా, మహిళలకు గడ్డాలు వచ్చినా, మొగవాళ్ల గొంతులు మారినా, ఫైజర్‌ పట్టించుకోదని గుర్తు చేశారు. వివిధ దేశాలలో కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీపై విమర్శలు వస్తున్నాయి...

Tags :
|
|

Advertisement