Advertisement

  • ఈ సారి ఐపీయల్ ఎవరు విన్ అవుతారో చెప్పిన బ్రాడ్ హాగ్

ఈ సారి ఐపీయల్ ఎవరు విన్ అవుతారో చెప్పిన బ్రాడ్ హాగ్

By: Sankar Thu, 03 Sept 2020 4:42 PM

ఈ సారి ఐపీయల్ ఎవరు విన్ అవుతారో చెప్పిన బ్రాడ్ హాగ్


మరికొద్ది రోజుల్లో ఐపీయల్ ప్రారంభం అవుతుంది అనగా అన్ని ఫ్రాంచైజీలు ఎవరి సాధనలో వారు మునిగితేలుతున్నారు..అయితే ఈ సారి ఐపీయల్ యూఏఈ లో జరుగుతుండటంతో ఎవరు విన్ అవుతారో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..అయితే అటువంటి ప్రశ్నకే సమాధానం ఇచ్చాడు ఆస్ట్రేలియా బౌలర్ బ్రాడ్ హాగ్.

ఈ మధ్య అభిమానులతో ట్విట్టర్ లో చిట్ చాట్ చేసిన బ్రాడ్ హాగ్ ను ఓ అభిమాని... 'ఏ జట్టు ఐపీఎల్ 2020 లో విజయం సాధిస్తుంది' అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్' ఈ మూడు జట్లలోనే ఏదో ఒక జట్టు టైటిల్ అందుకుంటుంది అని తెలిపాడు. అయితే ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లేకపోవడం కొంచెం ఆశ్చర్యమే చెప్పాలి.

ఇక బ్రాడ్ హాగ్ చెప్పిన జట్లలో ఐపీఎల్ లో ముంబై జట్టు అత్యధికంగా 4 సార్లు విజయం సాధించింది. కేకేఆర్ రెండుసార్లు టైటిల్ అందుకోగా ఆర్సీబీ మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజేతలుగా నిలువలేదు. మరి చూడాలి బ్రాడ్ హాగ్ చెప్పింది నిజం అవుతుందా... లేదా అనేది.

Tags :
|
|
|
|

Advertisement