Advertisement

  • క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ ..బాక్సింగ్ డే టెస్ట్ కు స్టేడియంలోకి అభిమానులను అనుమతించే అవకాశం

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ ..బాక్సింగ్ డే టెస్ట్ కు స్టేడియంలోకి అభిమానులను అనుమతించే అవకాశం

By: Sankar Thu, 29 Oct 2020 6:28 PM

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ ..బాక్సింగ్ డే టెస్ట్ కు స్టేడియంలోకి అభిమానులను అనుమతించే అవకాశం


విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఐపీఎల్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. మూడు నెలల ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌లు జరగనున్నాయి. నవంబర్ 27న మొదలయ్యే ఈ టూర్ కోసం భారత జంబో జట్టు ఆసీస్‌కు వెళ్లనుంది. దుబాయ్ నుంచి సిడ్నీకి ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. అయితే టెస్టు సమరం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ శుభవార్త అందింది.

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగే ప్రతిష్టాత్మక బాక్సింగ్‌ డే టెస్టుకు ప్రేక్షకులను అనుమతించే అవకాశాలున్నాయి. మెల్‌బోర్న్‌ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పడుతుండటంతో ఆ దిశగా సమాలోచనలు జరుగుతున్నాయి. అయితే వచ్చే వారం జరగనున్న మెల్‌బోర్న్‌ కప్‌ గుర్రపు పందేల పోటీలకు మాత్రం అభిమానులను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇక డిసెంబరు నెల చివరలో జరిగే బాక్సింగ్‌ డే టెస్టు మాత్రం ప్రేక్షకుల నడుమ జరిగే వీలుందని విక్టోరియా రాష్ట్ర ప్రిమియర్‌ డానియల్‌ ఆండ్రూస్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభించడంతో అన్ని దేశాలు లాక్ డౌన్ విదించుకున్నాయి..ఈ లాక్ డౌన్ ప్రక్రియలో భాగంగా స్టేడియంలలో అభిమానులు లేకుండానే క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు ..క్రికెట్ మ్యాచ్ లను కూడా అలాగే అభిమానులు ఎవరు లేకుండా నిర్వహిస్తున్నారు..అయితే కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నట్లు కనిపించడంతో తిరిగి ప్రేక్షకులను అనుమతించే ఆలోచనలో ఉన్నారు క్రికెట్ నిర్వాహకులు...

Tags :
|
|
|
|

Advertisement