Advertisement

  • కంగనా రనౌత్ వ్యవహారంలో ఎంపీ సంజయ్ రౌత్ ను తీవ్రంగా మందలించిన బొంబాయి హై కోర్ట్

కంగనా రనౌత్ వ్యవహారంలో ఎంపీ సంజయ్ రౌత్ ను తీవ్రంగా మందలించిన బొంబాయి హై కోర్ట్

By: Sankar Fri, 27 Nov 2020 7:20 PM

కంగనా రనౌత్ వ్యవహారంలో ఎంపీ సంజయ్ రౌత్ ను తీవ్రంగా మందలించిన బొంబాయి హై కోర్ట్


కంగనా రనౌత్ కేసులో శివసేన నేత సంజయ్ రౌత్ ను బాంబే హైకోర్టు తీవ్రంగానే మందలించింది. కంగనాపై లోగడ చేసిన వ్యాఖ్యలు ఆయన ఎంపీ పదవికి తగినట్టు లేవని పేర్కొంది. ఒక పార్లమెంటేరియన్ గా మీరు నడచుకోలేదని వ్యాఖ్యానించింది. ఇంతేకాదు.. ఈ కేసులో మీరిచ్చిన వివరణ కూడా తమకు అంగీకారయోగ్యంగా లేదని న్యాయమూర్తులు అన్నారు.

కంగనా పట్ల లోగడ సంజయ్ రౌత్ అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. గతంలో వీరి మధ్య ట్విటర్ వార్ ఓ రేంజ్ లో నడిచింది. అదే సమయంలో కంగనా రనౌత్ ను కూడా కోర్టు దాదాపు తప్పు పట్టింది. ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా ఆమె పేర్కొనడంలోని ఔచిత్యాన్ని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ప్రభుత్వంపై తమ అభిప్రాయాలు తెలియజేసేటప్పుడు వ్యక్తులు నిగ్రహంగా,సంయమనంగా వ్యవహరించాలని వారు సూచించారు.

మహారాష్ట్రను, ముంబైని అవమానపరుస్తూ కంగనా చేసిన కామెంట్స్ సరి కాదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పై కంగనా వేసిన కేసులో కోర్టు నుంచి ఆమెకు ఊరట లభించింది. తన బంగళాను అధికారులు పాక్షికంగా కూల్చివేయడాన్నిఆమె సవాల్ చేసింది. కూల్చివేతకు గాను ఆమెకి పరిహారం చెల్లించాలని కోర్టు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ని ఆదేశించింది

Tags :
|

Advertisement