Advertisement

తమిళ‌ హీరోలకు బాంబు బెదిరింపులు

By: chandrasekar Tue, 29 Sept 2020 7:12 PM

తమిళ‌ హీరోలకు బాంబు బెదిరింపులు


ఇటీవల కాలంలో సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌, అజిత్‌, మ‌ణిర‌త్నం, విజ‌య్ త‌దిత‌రుల ఇళ్లు, ఆఫీసుల్లో బాంబులు పెట్టామంటూ పోలీసుల‌కు ఫోన్ కాల్స్ వ‌చ్చాయి.

దీంతో పోలీసులు వెంటనే అక్కడ తనిఖీలు చేయగా అవన్నీ ఫేక్ కాల్స్ అని తేలింది. ఈ నేపథ్యంలో తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ హీరోగా కొనసాగుతున్న సూర్యను కూడా కేటుగాళ్లు టార్గెట్ చేశారు.

సోమవారం చెన్నై అల్వార్‌పేట ప్రాంతంలో ఉన్న హీరో సూర్య ఆఫీసులో బాంబు పెట్టినట్లు పోలీసులకు ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే డాగ్‌స్వ్కాడ్‌ను తీసుకెళ్లి తనిఖీలు చేశారు.

ఆ ప్రాంతంలో ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో అది ఫేక్‌ కాల్ అని నిర్ధారించుకున్నారు. అయితే ఈ కాల్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags :
|
|

Advertisement