Advertisement

  • చియాన్ విక్రమ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు బెదిరింపులు ...

చియాన్ విక్రమ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు బెదిరింపులు ...

By: Sankar Mon, 30 Nov 2020 9:12 PM

చియాన్ విక్రమ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు బెదిరింపులు  ...


త‌మిళ హీరోల ఇళ్ల‌ల్లో బాంబు పెట్టామంటూ ఫోన్ కాల్స్ రావ‌డం ఇటీవ‌లి కాలంలో మ‌రీ ఎక్కువ‌య్యాయి. ఇలాంటి ఆగంత‌కుల‌కు పోలీసులు ఎంత బుద్ధి చెప్పినా వారు తీరు మార్చుకోవ‌డం లేదు.

తాజాగా ప్ర‌ముఖ నటుడు చియాన్ విక్ర‌మ్ నివాసానికి బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. సోమ‌వారం నాడు ఓ ఆగంత‌కుడు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెన్నైలోని హీరో విక్ర‌మ్ ఇంట్లో బాంబు పెట్టిన‌ట్లు బెదిరించారు. దీంతో పోలీసులు, బాంబ్‌స్క్వాడ్‌తో స‌హా హుటాహుటిన‌ ఆయ‌న ఇంటికి చేరుకుని సోదాలు నిర్వ‌హించారు.

అంగుళం అంగుళం జ‌ల్లెడ ప‌ట్టినా బాంబు ఆన‌వాళ్లు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఎవ‌రో ఆగంత‌కుడు బెదిరింపు కాల్స్ సిన‌ట్లు ధృవీకరించారు. అత‌డు విల్లాపురం నుంచి కాల్ చేసినట్లు గుర్తించారు. ప్ర‌స్తుతం పోలీసులు అత‌డిని ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు

Tags :
|

Advertisement