Advertisement

  • ఆ డాక్టర్ దగ్గర డాన్స్ నేర్చుకోవాలని ఉంది ..డాక్టర్ డాన్స్ వీడియోపై స్పందించిన హృతిక్ రోషన్

ఆ డాక్టర్ దగ్గర డాన్స్ నేర్చుకోవాలని ఉంది ..డాక్టర్ డాన్స్ వీడియోపై స్పందించిన హృతిక్ రోషన్

By: Sankar Tue, 20 Oct 2020 12:10 PM

ఆ డాక్టర్ దగ్గర డాన్స్ నేర్చుకోవాలని ఉంది ..డాక్టర్ డాన్స్ వీడియోపై స్పందించిన హృతిక్ రోషన్


అసోంలో ఓ డాక్టర్‌ పీపీఈ కిట్‌, ఫేస్‌షీల్డ్‌ మాస్కు ధరించి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.హృతిక్ నటించిన'వార్'సినిమాలోని 'గుంగురు 'పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసాడు. ఈ వీడియోను సహోద్యోగి అయిన డాక్టర్‌ ఫైజన్‌ అహ్మద్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

దీంతో వైద్యుడి డ్యాన్స్‌ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.ఈ డ్యాన్స్ పై హృతిక్ స్పందించాడు. 'నేను ఆయన దగ్గర స్టెప్పులు నేర్చుకుని, ఆ డ్యాన్స్‌ చేయాలనుకుంటున్నానని డాక్టర్‌ అరుప్‌కు చెప్పండి. ఆయన ఆత్మస్థైర్యం అద్భుతం' అని పేర్కొన్నారు. హృతిక్‌ స్పందించడంతో అమితానందం వ్యక్తం చేశారు డాక్టర్‌ అరూప్‌..

“సర్, నేను డాక్టర్ అరుప్. చాలా ధన్యవాదాలు సార్‌. కహో నా ప్యార్ హై సినిమా నుంచి మీరు నా హీరో, మీలాంటి గొప్ప వారికి డ్యాన్స్‌ నేర్పే అంత వాడిని కాదు సార్‌. ట్వీట్ చేసినందుకు ధన్యవాదాలు సార్' అంటూ రాసుకొచ్చాడు.

Tags :

Advertisement