Advertisement

  • లాక్‌డౌన్‌తో బాలీవుడ్ సింగర్ రణు మండల్ కి మళ్లీ కష్టాలు

లాక్‌డౌన్‌తో బాలీవుడ్ సింగర్ రణు మండల్ కి మళ్లీ కష్టాలు

By: chandrasekar Sat, 13 June 2020 8:15 PM

లాక్‌డౌన్‌తో బాలీవుడ్ సింగర్ రణు మండల్ కి మళ్లీ కష్టాలు


కరోనా వైరస్ ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసింది. లాక్‌డౌన్ తెచ్చిన ఇబ్బందులతో అంతా అస్తవ్యస్తమయింది. ఒకప్పుడు గొప్పగా బతికిన వారు రోడ్డున పడుతున్నారు. దాన ధర్మాలు చేసిన చేతులే ఇప్పుడు ఇతరుల సాయం కోరుతున్నాయి.

బాలీవుడ్ సింగర్ రణు మండల్ పరిస్థితి కూడా ఇదే. ఒకప్పుడు రైల్వేస్టేషన్‌లో రానూ మండల్ పాటలు పాడుకుంటూ బతికిన ఆమె తర్వాత బాలీవుడ్‌లో పలు సినిమాలకు పాటలు పాడింది. అలాంటి రణూ లాక్‌డౌన్ వల్ల మళ్లీ పేదరికంలోకి వెళ్లింది. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన మార్చి నెలాఖరులో పలువురికి ఆహార పదార్థాలు పంచిన ఆమే.. ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతోంది రణు. చుట్టు పక్కల ఉన్న వారు ఏమైనా పెడితేనే తింటోంది. లేదంటే మంచి నీళ్లు తాగి ఖాళీ కడుపుతోనే నిద్రపోతోంది.

రోజుకు ఒకేపూట అన్నం తింటూ దుర్భర జీవితం గడుపుతోంది. లాక్‌డౌన్ వల్ల పలు సార్లు ఆకలితో అలమటించానని తన పరిస్థితిని చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది రణు. వెస్ట్‌బెంగాల్‌లోని రాణాఘాట్‌కు చెందిన రుణు మండల్ రైల్వే స్టేషన్లలో పాటలు పాడుతూ జీవనం సాగించేంది. ఐతే లతా మంగేష్కర్ ఆలపించిన 'ఏక్ ప్యార్ కా నగ్మా హే' పాటను ఓ సారి పాడడంతో.. అతీంద్ర చక్రవర్తి అనే వ్యక్తి మొబైల్ కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఆమె గాత్రానికి ప్రజలు ముగ్దులైనారు. మట్టిలో మాణిక్యమంటూ పొగడ్తలు కురిపించారు. ఆ తర్వాత రణుకు బాలీవుడ్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. హిమేష్ రష్మియా, ఉదిత్ నారాయణ్ వంటి సెలబ్రిటీలు ఆమెకు అవకాశాలిచ్చారు. ఐతే కరోనా లాక్‌డౌన్‌తో రుణు జీవితం మళ్లీ మొదటికి వచ్చింది.

Tags :

Advertisement