Advertisement

  • బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే భర్త సామ్ బోంబే అరెస్ట్

బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే భర్త సామ్ బోంబే అరెస్ట్

By: chandrasekar Wed, 23 Sept 2020 12:33 PM

బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే భర్త సామ్ బోంబే అరెస్ట్


బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే భర్త సామ్ బోంబేను మంగళవారం గోవా పోలీసులు అరెస్టు చేశారు. సామ్ తనను వేధించాడని, హింసించాడని, తనపై దాడి చేశాడని పూనమ్ సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సామ్‌ను అరెస్ట్ చేశారు. సామ్‌ను దక్షిణ గోవాలోని కనకోనలో అరెస్టు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుత పూనమ్ పాండే అక్కడ ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. ‘‘తన భర్త సామ్ బోంబే తనను బెదిరించడమే కాకుండా తనపై దాడి చేశాడని, వేధించాడని సోమవారం అర్ధరాత్రి పాండే ఫిర్యాదు చేసింది. అతన్ని అరెస్టు చేశాం’’ అని కనకోన పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తుకారాం చవన్ తెలిపారు.

బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు పంపామని చెప్పారు. మరోవైపు, పూనమ్‌తో తీసుకున్న అన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి సామ్ బోంబే తొలగించడం వారిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది అనడానికి రుజువు. పది రోజుల క్రితం పూనమ్ పాండే, సామ్ బోంబేల వివాహం జరిగింది. తనకు పెళ్లయిన విషయాన్ని, భర్తతో తాను తీసుకున్న ఫొటోలను పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అలాగే, గోవాలో హనీమూన్‌కు వెళ్లిన ఫొటోలను షేర్ చేశారు. గోవాలో ఓ వైపు సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు భర్తతో పాండే హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అక్కడ ఏదో జరిగింది. అసలు విషయం తెలియాల్సి ఉంది.

Tags :

Advertisement