Advertisement

  • ప్రతి దినం ఆవు మూత్రం తాగుతానంటున్న బాలీవుడ్ హీరో

ప్రతి దినం ఆవు మూత్రం తాగుతానంటున్న బాలీవుడ్ హీరో

By: chandrasekar Fri, 11 Sept 2020 12:05 PM

ప్రతి దినం ఆవు మూత్రం తాగుతానంటున్న బాలీవుడ్ హీరో


బేర్ గ్రిల్స్, హుమా ఖురేషిలతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్ సందర్భంగా అక్షయ్ కుమార్ ప్రతిరోజూ తాను ఆవు మూత్రం తాగుతున్నానని పేర్కొన్నారు. ఇంటు ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ లో కొన్ని డేర్ డెవిల్ స్టంట్స్ అక్షయ్ కుమార్ ప్రదర్శిస్తారు. చెట్టుకు కట్టిన తాడు నిచ్చెన ఆధారంగా ఒక నీటి ప్రవాహాన్ని దాటుతారు. ఇలాంటి స్టంట్స్ ఎలా చేయగలిగారని హుమా ఖురేషి చాట్ సమయంలో ప్రశ్నించగా ఆయుర్వేద కారణాల వల్ల ఇది తనకు సమస్య కాదని అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రత్యేకమైన టీ తాగాల్సిందిగా అక్షయ్‌ను ఎలా ఒప్పించారని హుమా బేర్ గ్రిల్స్‌ను అడిగినప్పుడు "మేము ఆ పని ఎలా చేశామో నాకే తెలియదు కాని అది చాలా చెడ్డదిగా ఉంది" అని చెప్పారు. గ్రిల్స్‌కు అక్షయ్ సమాధానమిస్తూ, "నేను ఆందోళన చెందలేదు. ఆయుర్వేద కారణాల వల్ల నేను ప్రతి రోజు ఆవు మూత్రాన్ని తీసుకుంటున్నాను" అని చెప్పేసరికి ఇద్దరూ ఆశ్చర్యపోయారు.

అక్షయ్ కుమార్‌తో తన అనుభవం గురించి అడగ్గా.. ఎంతో ప్రశాంతంగా ఉంటారని, ఎలాంటి అహం లేదని, వినయంగా ఉండే వ్యక్తి అని బేర్ గ్రిల్స్ ఆకాశానికెత్తాడు. తనవి సురక్షితమైన చేతులైనందునే రిలాక్స్ అయ్యానని అక్షయ్ కుమార్ చెప్పాడు. బేర్ గ్రిల్స్ ప్లేస్ లో మీరు ఉన్నట్లయితే అతడితో ఏ స్టంట్స్ చేయించేవారని చాట్ లో ఓ అభిమాని అడగ్గా.. విమానం నుంచి దూకమని, ఆవు మూత్రంతో చేసిన టీ తాగమని, తిమింగలాలతో సముద్రంలో ఈతకొట్టమని పురమాయించేవాడినని అక్షయ్ కుమార్ సరదాగా చెప్పడం నవ్వుల్లో ముంచెత్తింది. ఇంటూ ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ కార్యక్రమం ఈ నెల 11 న రాత్రి 8 గంటలకు డిస్కవరీ ప్లస్ యాప్‌లో, సెప్టెంబర్ 14 న రాత్రి 8 గంటలకు డిస్కవరీ ఛానెల్‌లో రాబోతుంది.

Tags :
|
|

Advertisement