Advertisement

  • కోర్టుకెక్కిన బాలీవుడ్ బడా సంస్థలు ..ఎందుకో తెలుసా !

కోర్టుకెక్కిన బాలీవుడ్ బడా సంస్థలు ..ఎందుకో తెలుసా !

By: Sankar Tue, 13 Oct 2020 1:15 PM

కోర్టుకెక్కిన బాలీవుడ్ బడా సంస్థలు ..ఎందుకో తెలుసా !


గత కొంత కాలంగా బాలీవుడ్ చిక్కులో పడ్డ విషయం తెలిసిందే . యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ పై పలు రకాల విమర్శలు వెల్లువెత్తాయి . డ్రగ్స్ కోణం కూడా బయటకు రావడంతో బాలీవుడ్ పై ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.

ఇదిలా ఉంటే జాతీయ మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి అంటూ బాలీవుడ్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించడం సంచలనమైంది. ఇందులో బాలీవుడ్ కి చెందిన అన్ని బడా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. దేశానికి ఎంతో ఆదాయం తెచ్చి పెడుతున్న బాలీవుడ్ పరువు మర్యాదల్ని మంట కలుపుతారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. కోర్టుకెక్కిన నిర్మాణ సంస్థలలో షారుఖ్ ఖాన్- అమీర్ ఖాన్- సల్మాన్ ఖాన్ కి చెందిన ప్రొడక్షన్ హౌసెస్... మరో 35 మంది కొన్ని మీడియా సంస్థల 'తప్పుడురిపోర్టింగ్’ కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు.

అజయ్ దేవ్గన్- ఫర్హాన్ అక్తర్- కరణ్ జోహార్ తదితరులు యాజమాన్యంలోని ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్లు, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్- సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్- అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, అక్షయ్ కుమార్.... ఆfiదిత్య చోప్రా- ఫర్హాన్ అక్తర్- జోయా అక్తర్ .. అన్ని ప్రధాన బ్యానర్ ల ప్రొడక్షన్ హౌస్ లు అందరూ కలిసి ఒక న్యూస్ ఛానల్ సహా నలుగురు జర్నలిస్టులపై దావా వేశారు. ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ,సినీ & టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా ఈ దావాలో చేరాయి

Tags :

Advertisement