Advertisement

  • డిగ్రీలో ప్రవేశ మెరిట్ జాబితాలో బాలీవుడ్ నటి సన్నీలియోన్ అగ్రస్థానం

డిగ్రీలో ప్రవేశ మెరిట్ జాబితాలో బాలీవుడ్ నటి సన్నీలియోన్ అగ్రస్థానం

By: chandrasekar Sat, 29 Aug 2020 4:46 PM

డిగ్రీలో ప్రవేశ మెరిట్ జాబితాలో బాలీవుడ్ నటి సన్నీలియోన్ అగ్రస్థానం


బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ డిగ్రీలో ప్రవేశం కోసం కోల్ కతాలోని అషుతోష్‌ కాలేజీ ప్రకటించిన మెరిట్‌ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. కాలేజీ వెబ్‌సైట్‌లో బీఏ ప్రవేశానికి ఉద్దేశించిన జాబితాలో సన్నీ పేరు టాప్‌లో రావడంతో విద్యార్థులంతా ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. నటి ఈ కాలేజీలో చదువుతుందా ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు.

సన్నీ పేరుతో పాటు అప్లికేషన్ ఐడి, రోల్ నంబర్ కూడా ఉండటం, అంతేకాక 12వ తరగతి బోర్డు పరీక్షల్లో బెస్ట్‌ ఫోర్‌ సబ్టెక్టుల్లో పూర్తి మార్కులు అంటే 400 మార్కులు సాధించడం విశేషం. ఇది కాస్తా గందరగోళానికి దారి తీయడంతో కాలేజీ యాజమాన్యం దీనిపై స్పందించింది. ఇది ఎవరో ఆకతాయి చేసిన పని అని పేర్కొన్నారు. కావాలనే ఎవరో తప్పుడు దరఖాస్తును సమర్పించారని పేర్కొంది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Tags :

Advertisement