Advertisement

  • ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని మహిళా ఉద్యోగినిపై సహోద్యోగి దాడి..

ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని మహిళా ఉద్యోగినిపై సహోద్యోగి దాడి..

By: Sankar Mon, 21 Sept 2020 2:42 PM

ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని మహిళా ఉద్యోగినిపై సహోద్యోగి దాడి..


కామారెడ్డి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళ పై సహ ఉద్యోగి దాడికి దిగిన ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగినిగా పని చేస్తున్న రోజా అనే మహిళపై బోధన్ సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ దాడి చేశాడు.

గతంలో రామకృష్ణ బోధన్ మున్సిపల్ ఆఫీసులో పనిచేశాడు. రామకృష్ణ కింద రోజా మరియు జూనియర్ అసిస్టెంట్ పని చేసేవారు. బదిలీ పై వెళ్లినప్పటినుండి రామకృష్ణ ఉద్యోగిని రోజాకు ఫోన్ చేసి మాట్లాడేవాడని తెలుస్తోంది. అయితే కొన్ని నెలల నుండి రామకృష్ణ ఎన్ని సార్లు ఫోన్ చేసినా రోజా లిఫ్ట్ చేయడం లేదట. దాంతో ఆగ్రహానికి గురైన రామకృష్ణ కామారెడ్డి కార్యాలయానికి వచ్చి రోజాతో వాగ్వాదానికి దిగి ఆమెపై దాడి చేసాడు. దాంతో ఆమె ముక్కుకి తీవ్ర గాయం అయ్యింది.

ఆమెను వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణపై రోజా కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన దృశ్యాలను సహ ఉద్యోగులు ఫోన్ లలో వీడియోలు తీశారు.

Tags :
|
|

Advertisement