Advertisement

  • ముంబై వచ్చే సీబీఐ బృందం క్వారంటైన్ మినహాయింపు తీసికోవాలని తెలిపిన 'బీఎంసీ' కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్

ముంబై వచ్చే సీబీఐ బృందం క్వారంటైన్ మినహాయింపు తీసికోవాలని తెలిపిన 'బీఎంసీ' కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్

By: chandrasekar Thu, 20 Aug 2020 09:24 AM

ముంబై వచ్చే సీబీఐ బృందం క్వారంటైన్ మినహాయింపు తీసికోవాలని తెలిపిన 'బీఎంసీ'  కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్


ముంబై వచ్చే సీబీఐ బృందం క్వారంటైన్ మినహాయింపు తీసికోవాలని 'బీఎంసీ' కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ తెలిపారు. సుశాంత్ సింగ్ మరణం కేసు దర్యాప్తునకు ముంబై వచ్చే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 'సీబీఐ' బృందం క్వారంటైన్ నుంచి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేయాల్సి ఉంటుందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ బుధవారం తెలిపారు.

విచారణ కోసం సీబీఐ బృందం 7 రోజులు వరకు మాత్రమే ఉండాల్సి వస్తే ప్రస్తుతం ఎంసీసీఎంలో అమలు చేస్తున్న కరోనా మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుందని ఆయన చెప్పారు. కానీ దీని కోసం ధృవీకరించిన రిటర్న్ టికెట్ చూపించాల్సి ఉంటుందని అన్నారు. ఒకవేళ ఏడు రోజులకు మించి ముంబైలో ఉండాల్సి ఉంటే క్వారంటైన్ నుంచి మినహాయింపు కోసం తమ ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. దానిని పరిశీలించి ఆ మేరకు మినహాయింపు ఇస్తామని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ వెల్లడించారు. కరోనా కారణంగా మినహాయింపు పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి వుంది.

సుశాంత్ కేసు దర్యాప్తు కోసం ముంబై వచ్చిన బీహార్ ఐపీఎస్ అధికారిని బీఎంసీ అధికారులు క్వారంటైన్‌లో ఉంచిన సంగతి అందరికి తెలిసిందే. ఈ విధంగా చేయడం వల్ల రెండు రాష్ట్రాల పోలీసులు, ప్రభుత్వాల మధ్య వివాదానికి దారి తీసి చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ బుధవారం కోర్ట్ తీర్పుఇచ్చింది. ఈ నేపథ్యంలో ముంబైలో ఏడు రోజులకు మించి సీబీఐ టీం ఉండదలిస్తే క్వారంటైన్ మినహాయింపు కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుందని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ స్పష్టం చేశారు. ఇందుకు సిబిఐ తగిన ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది.

Tags :
|

Advertisement