Advertisement

బ్లూ మూన్ వచ్చేస్తుంది: నాసా

By: chandrasekar Mon, 26 Oct 2020 4:54 PM

బ్లూ మూన్ వచ్చేస్తుంది:  నాసా


భౌగోళికంగా ఎన్నో వింతలు చూస్తుంటాం కానీ ఈ నెలలో అద్భుతం చూడబోతున్నాం అదే బ్లూ మూన్. మీరు అక్టోబర్‌ నెలంతా రాత్రివేళ ఆకాశాన్ని నిశితంగా గమనిస్తే మీకు కనీసం పావు గంటలో ఒక్కటైనా ఉల్క ఆకాశంలో అలా వెళ్తూ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెలంతా ఉల్కాపాతం కొనసాగుతోంది. ఇదే అద్భుతం అనుకుంటే ఇంతకు మించిన ఆనందాన్ని చందమామ ఇవ్వబోతోంది. ఈ అద్భుతం కోసం ఈ నెల చివరి దాక వేచి ఉండాల్సిందే.

ఆకాశంలో ఈ అక్టోబర్ 31న బ్లూమూన్ కనిపించబోతోంది. సంపూర్ణ చందమామ అత్యంత ఎక్కువ కాంతితో, పెద్ద పరిమాణంలో కనిపించబోతోంది. అక్టోబర్ 1న కూడా ఇలాంటిది వచ్చింది. కానీ దాని కంటే ఇదే ఎక్కువ కాంతితో కనిపించనుంది. ఈసారి వచ్చే పెద్ద బ్లూ మూన్ ఎప్పుడో 76 ఏళ్ల కిందట రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1944లో వచ్చింది. మళ్లీ ఇప్పుడే హాలోవీన్ టైమ్‌లో వస్తోంది. దీనిని ప్రజలందరూ చూసి ఆస్వాదించాలని తెలిపారు.

Tags :
|
|
|

Advertisement