Advertisement

  • నల్లజాతి యువకుడి మరణంపై అమెరికాలో ఆగని నిరసనలు

నల్లజాతి యువకుడి మరణంపై అమెరికాలో ఆగని నిరసనలు

By: Sankar Sun, 31 May 2020 3:53 PM

నల్లజాతి యువకుడి మరణంపై అమెరికాలో ఆగని నిరసనలు

నల్లజాతి యువకుడిని శ్వేతజాతి పోలీసు తొక్కి చంపిన ఘటనపై నిరసనలు అమెరికా అంతటా విస్తరిస్తున్నాయి. జార్జి ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలంటూ శుక్రవారం పలు నగరాల్లో వేలమంది నల్లజాతి ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు.

మినియాపొలి్‌సలో కర్ఫ్యూను కూడా లెక్క చేయకుండా వరుసగా నాలుగో రోజూ భారీ ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా యువత విధ్వంసానికి, లూటీలకు పాల్పడ్డారు. దుకాణాలను, రెస్టారెంట్లను తగులబెట్టారు. డెట్రాయిట్‌ నగరంలో ప్రదర్శనకారులపై ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు మరణించాడు. అట్లాంటాలో పోలీసు కార్లను ధ్వంసం చేశారు.


న్యూయార్క్‌లో పోలీసులతో తలపడ్డారు. పలు నగరాల్లో నిరసనకారులు పోలీసులపై కాల్పులు జరిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో హింస తలెత్తిన చోట్ల అడిగిన వెంటనే సైన్యాన్ని అందుబాటులో ఉంచాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు. జార్జి ఫ్లాయిడ్‌ గొంతుపై మోకాలితో నొక్కి ఊపిరి ఆడకుండా చేసి, చంపిన పోలీసు అధికారి డెరెక్‌ చావిన్‌(44)ను అరెస్టు చేసి, హత్య కేసు నమోదు చేశారు.

Tags :

Advertisement