Advertisement

  • బ్లాక్ పాంథర్ నటుడు అకాల మరణం ..విషాదంలో హాలీవుడ్ సినీలోకం

బ్లాక్ పాంథర్ నటుడు అకాల మరణం ..విషాదంలో హాలీవుడ్ సినీలోకం

By: Sankar Sat, 29 Aug 2020 10:07 AM

బ్లాక్ పాంథర్ నటుడు అకాల మరణం ..విషాదంలో హాలీవుడ్ సినీలోకం


‘బ్లాక్ పాంథర్’ నటుడు చాడ్విక్ బోస్‌మాన్‌(43) కన్నుమూశారు. గత కొంతకాలంగా కోలన్‌(పెద్దపేగు) క్యాన్సర్‌తో పోరాడుతున్న బోస్‌మెన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. అతని మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ‘నిజమైన పోరాట యోధుడు, చాడ్విక్ పట్టుదలతో మీరు ఎంతో ప్రేమించిన అనేక చిత్రాలను మీ ముందుకు తీసుకువచ్చాడు. చాడ్విన్‌ ఇంట్లోనే మరణించాడు" అని చాడ్విక్‌ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా చాడ్విక్‌ నాలుగేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ఈ నటుడు 2016 నుండి స్టేజ్ త్రీ ప్రేగు క్యాన్సర్‌ తో బాధపడుతున్నాడు..

బోస్‌మాన్‌ దక్షిణ కరోలినాలోని అండర్సన్‌లో పుట్టి పెరిగాడు. 2013లో లెజండరీ బేస్ బాల్ ఆటగాడు జాకీ రాబిన్సన్ కథతో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘42’ తో సినిమాల్లో వచ్చాడు. 2016లో వచ్చిన కెప్టెన్‌ అమెరికా: సివిల్‌ వార్‌లో మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్‌గా కనిపించి అంనతరం బోస్‌మెన్‌​ అతని ఇంటి పేరుగా మారింది. ఆ తర్వాత 2018లో వచ్చిన బ్లాక్ పాంథర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసింది. అతను అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్,ఎవెంజర్స్: ఎండ్‌గేమ్‌లోని మరో రెండు పాత్రలతో అభిమానులను అలరించాడు. ఈ ఏడాది ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన డా 5 బ్లడ్స్‌లో చాడ్విక్‌ చివరి సారిగా కనిపించారు

హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్‌మ్యాన్‌ అకాలమరణం సినీలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అతని మరణం తీరని లోటంటూ పలువురు హాలీవుడ్ ప్రముఖులు, ఇతరులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డొమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ కూడా విచారం ప్రకటించారు. తెలివైన వాడు, మంచివాడు. తన స్నేహితుడు ఇంత చిన్న వయసులో ఈ లోకాన్ని వీడాడంటూ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు

Tags :
|

Advertisement