Advertisement

  • దుబ్బాక ఉప ఎన్నిక పర్యవేక్షణ అధికారిని నియమించడాన్ని స్వాగతించిన బిజెపి

దుబ్బాక ఉప ఎన్నిక పర్యవేక్షణ అధికారిని నియమించడాన్ని స్వాగతించిన బిజెపి

By: Sankar Wed, 28 Oct 2020 10:05 PM

దుబ్బాక ఉప ఎన్నిక పర్యవేక్షణ అధికారిని నియమించడాన్ని స్వాగతించిన బిజెపి


దుబ్బాక ఉప ఎన్నికలకు పోలీస్ అబ్జర్వర్ గా తమిళనాడు రాష్ట్రానికి చెందిన సరోజ్ కుమార్ ఠాకూర్ ఐపీఎస్ ను నియమించడం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ స్వాగతిస్తుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నది అన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని వారి కుటుంబ సభ్యులను కార్యకర్తలను దాడులతో వేధించడమే కాకుండా సోదాల నెపంతో వారి పై తప్పుడు కేసులు బనాయిస్తున్నది అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

స్థానికంగా టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉండటంతో ఎన్నికల సంఘం కేంద్ర రాష్ట్ర నిఘా విభాగాల సూచనలు, ప్రజల ఒత్తిడి, భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి మేరకు పోలీస్ అబ్జర్వర్ గా సరోజ్ కుమార్ ఠాకూర్ ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది అని బండి సంజయ్ తెలిపారు.

కేంద్ర ఎన్నికల సంఘం దుబ్బాక లో శాంతిభద్రతల పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఈ ప్రత్యేక అధికారిని నియమించిన తర్వాత శాంతియుతంగా నిష్పక్షపాతంగా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కృషి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ విజ్ఞప్తి చేస్తున్నది అని తెలిపారు.

Tags :
|

Advertisement