Advertisement

  • ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి

By: chandrasekar Sat, 12 Dec 2020 6:12 PM

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి


ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ దుర్గాప్రసాద్ అకాల మరణం కారణంగా జరగనున్న ఈ ఉప ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దుబ్బాక ఉప ఎన్నిక విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికలో అనూహ్య గెలుపు తరహాలోనే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికనే బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. తిరుపతిలో శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, జాతీయ ఉపాధ్యక్షులు రమణ్ సింగ్, కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యులు వి.మురళీధరన్ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాజీ సీఎం రమణ్ సింగ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం కేంద్ర పథకాలకు నవరత్నాలు అని పేరు మార్చి అందిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు జగన్ పాలనలో అస్తవ్యస్తంగా మారాయన్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ రోడ్డు వరకు శోభాయాత్ర ఉంటుంది. శోభాయాత్రలో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే మిత్రపక్షం జనసేన పార్టీకి బీజేపీ ఉప ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో తిరుపతిలో బీజేపీ మొదటి నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. జనసేన మాత్రం ఇప్పటి వరకు తిరుపతిలో ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు.


Tags :
|

Advertisement