Advertisement

  • మంత్రి హరీష్ రావు కు సవాల్ విసిరిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

మంత్రి హరీష్ రావు కు సవాల్ విసిరిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

By: Sankar Wed, 21 Oct 2020 2:43 PM

మంత్రి హరీష్ రావు కు సవాల్ విసిరిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ


దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఇవాళ ప్రెస్‌మీట్ నిర్వహించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కేంద్ర నిధులపై సీఎం కేసీఆర్‌తో చర్చకు బండి సంజయ్ వస్తారని మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు.

కేంద్ర నిధులపై ఆర్థికమంత్రి హరీశ్‌రావుకు స్పష్టత లేకపోవటం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు. హరీష్ రావు తన పేరును అరిచే రావుగా మార్చుకోవాలని సూచించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో హరీష్ రావు చెప్పాలన్నారు. ఓటమి భయంతో హరీశ్‌రావు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ అధికారం, డబ్బు బలంతో గెలవాలని చూస్తుందని డీకే అరుణ తీవ్రస్థాయిలో విమ‌ర్శించారు.

కాగా బీజేపీ అధ్యక్షుడు అయిన బండి సంజయ్ మీద మంత్రి హరీష్ రావు విమర్శలు చేసిన విషయం తెలిసిందే..దుబ్బాక ఉప ఎన్నికను అన్ని ప్రత్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి..ఈ ఎన్నికలో గెలిచి తెరాస కు ఎదురులేదు అని నిరూపించుకోవాలని పాలక పక్షం భావిస్తుంటే , ఎలాగయినా గెలిచి తెరాస మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని నిరూపించాలని ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్నాయి..

Tags :
|

Advertisement