Advertisement

  • తెలంగాణలో అవినీతి , అసమర్ధ పాలన కొనసాగుతుంది ...బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌

తెలంగాణలో అవినీతి , అసమర్ధ పాలన కొనసాగుతుంది ...బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌

By: Sankar Wed, 01 July 2020 9:20 PM

తెలంగాణలో అవినీతి , అసమర్ధ పాలన కొనసాగుతుంది ...బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌



తెలంగాణలో కరోనా టెస్ట్ ల మీద బీజేపీ చేస్తున్న విమర్శలు ఆగడం లేదు ..మొన్న జెపి నడ్డా , బండి సంజయ్ తెలంగాన లో కరోనా టెస్టులు ఎక్కువ చేయడం లేదు అని , కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం అయింది అని విమర్శలు గుప్పించారు ..తాజాగా కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అన్నారు.

తెలంగాణ ప్రాంతీయ జన సంవద్ వర్చువల్ ర్యాలీలో పాల్గొన్న ఆయన కేసీఆర్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు సరిగా లేవన్నారు. 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 20వేల కేసులుంటే 3 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 15 వేల పాజిటివ్‌ కేసులున్నాయని చెప్పారు. తెలంగాణలో టెస్టులు రోజుకు 3వేలు కూడా దాటడం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అవినీతి, అసమర్ధ పాలన కొనసాగుతోందని విమర్శించారు. సగం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్ప ప్రజలకు చూపించడానికి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. దేశ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. 2030 వరకు ప్రధానిగా మోదీనే కొనసాగుతారని రాంమాధవ్ తెలిపారు.

కాగా నేటి నుంచి హైదరాబాద్ పరిధిలో భారీగా టెస్టులు చేస్తాం అని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించిన విషయం తెలిసిందే ..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కరోనా కంట్రోల్లో లేదు అని , కరోనా నియంత్రణకు నిరంతరం పాటు పడుతున్న మమ్మల్ని విమర్శించడం మానుకోవాలని హితవు పలికాడు ..

Tags :
|
|
|

Advertisement