Advertisement

  • ఉద్రిక్తంగా మారిన బీజేపీ నడ్డా బెంగాల్‌ పర్యటన...

ఉద్రిక్తంగా మారిన బీజేపీ నడ్డా బెంగాల్‌ పర్యటన...

By: chandrasekar Thu, 10 Dec 2020 9:45 PM

ఉద్రిక్తంగా మారిన బీజేపీ నడ్డా బెంగాల్‌ పర్యటన...


పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు హింసాత్మకంగా మారుతున్న నేపధ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్‌ పర్యటన ఉద్రిక్తంగా మారింది. గురువారం కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ ప్రాంతంలో పర్యటిస్తున్న క్రమంలో జేపీ నడ్డా కాన్వాయ్‌పై ప్రత్యర్థులు రాళ్లతో దాడి చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కైలాష్ విజయవర్గీయ వాహనం ఈ దాడిలో మొత్తం దెబ్బతింది. ఈ క్రమంలో నడ్డా ప్రయాణిస్తున్న వాహనం ముందుకు వెళ్లగా విజయ వర్గీయ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసమైంది. తమ కాన్వాయ్‌పై రాళ్ల దాడికి సంబంధించిన ఫొటోలను విజయవర్గీయ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తృణమూల్ కార్యకర్తలు నల్లజెండాలతో తమ కాన్వాయ్‌ను ఆపడానికి ప్రయత్నించారని దిలీప్ ఘోష్ తెలిపారు. ఈ దాడి తృణమూల్ కాంగ్రెస్ నేతలే చేశారని ప్రణాళికతో తమపై దాడికి పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. కాన్వాయ్ ఆపకపోవడంతో రాళ్లదాడికి పాల్పడ్డారని తెలిపారు. బుధవారమే జీపీ నడ్డా పర్యటనలో భద్రత లోపం గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశానని చెప్పారు. బెంగాల్ ప్రభుత్వాన్నీ భద్రత లోపంపై హోం మంత్రిత్వ శాఖ వివరణ కోరింది.

Tags :
|
|
|

Advertisement