Advertisement

  • నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుంది..బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు

నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుంది..బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు

By: Sankar Mon, 28 Dec 2020 8:04 PM

నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుంది..బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు


కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకమైనవని.. దీని వల్ల రైతులు ఎవరూ ఇబ్బంది పడరని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ నూతన చట్టాలపై సూచనలు వింటామని, కానీ వెనకడుగేసేది లేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలు 30, 40 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టి ఉంటే రైతుల జీవితాలు బాగుపడేవన్నారు...

చట్టాలు రూపకల్పనలో మేధావులు, నిపుణులు అభిప్రాయాలు తీసుకున్నాం. చట్టాలపై కొంతమంది అపోహలు సృష్టించి ఆందోళనకు గురిచేస్తున్నారు. కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం రైతులు పండించిన పంటను మార్కెట్ యార్డ్‌ బయట అమ్ముకోవచ్చు. మార్కెట్ యార్డ్‌కు చెస్ కట్టాల్సిన అవసరం లేదు.

ఆ డబ్బులు రైతుకు మిగులుతాయి. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల కనీస మద్దతు ధర ఉండదని కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసత్యాలను నమ్మొద్దు. రైతులకు అపోహలు కలిగితే వాటిని నివృత్తి చేయడానికి సమావేశాలు నిర్వహిస్తున్నామని’’ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వివరించారు.

Tags :
|

Advertisement