Advertisement

  • జిహెచ్ఎంసి ఎన్నికలలో సీఎం అనుకున్నది రివర్స్ అయింది ...బీజేపీ నేత రాజా సింగ్

జిహెచ్ఎంసి ఎన్నికలలో సీఎం అనుకున్నది రివర్స్ అయింది ...బీజేపీ నేత రాజా సింగ్

By: Sankar Fri, 04 Dec 2020 11:42 AM

జిహెచ్ఎంసి ఎన్నికలలో సీఎం అనుకున్నది రివర్స్ అయింది ...బీజేపీ నేత రాజా సింగ్


గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ నడుస్తుంది..తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు .. 150 స్థానాలకు గాను ఇప్పటి వరకు 140 స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి..

అయితే.. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ అభ్యర్థులు దూసుకెళ్లారు.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 85 స్థానాల్లో బీజేపీ అగ్రస్థానంతో నిలవడగా... టీఆర్ఎస్‌ 35, ఎంఐఎం 17, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.. ఇక, ఎన్నికల ఫలితాలపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్... సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాటలను ప్రజలు నమ్మలేదని వ్యాఖ్యానించారు...

అన్ని కౌంటింగ్ సెంటర్లలో బీజేపీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.. ఎన్నికల్లో విజయం సాధించబోతున్నామన్న ఆయన.. గ్రేటర్ ఎన్నికల్లో సీఎం అనుకున్నది రివర్స్ అయ్యిందని ఎద్దేవా చేశారు.. ఇక, మేయర్ పీఠం భారతీయ జనతా పార్టీదే నంటూ ధీమా వ్యక్తం చేసిన రాజాసింగ్... ఈ సందర్భంగా బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు

Tags :
|
|
|

Advertisement