Advertisement

  • బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం... ముఖ్యమంత్రి పగ్గాలు బీజేపీ కా లేదంటే నితీశ్‌ కుమార్ కా?

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం... ముఖ్యమంత్రి పగ్గాలు బీజేపీ కా లేదంటే నితీశ్‌ కుమార్ కా?

By: chandrasekar Tue, 10 Nov 2020 8:32 PM

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం...  ముఖ్యమంత్రి పగ్గాలు బీజేపీ కా లేదంటే నితీశ్‌ కుమార్ కా?


బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఈ రోజు లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జేడీయూ కంటే బీజేపీ ఆధిక్యం చెలాయిస్తుంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణక్షణానికి ఆధిక్యం మారుతోంది. ప్రస్తుతం ఫలితాల సరళి ప్రకారం ఎన్డీయే కూటమి 128 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాకూటమి కూడా 102 చోట్ల ఆధిక్యంతో ఎన్డీయేకు గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించే అవకాశం ఉంది. ఆ పార్టీ 74 చోట్ల ఆధిక్యంలో ఉంది. గతంతో పోలిస్తే జేడీయూ తీవ్రంగా నష్టపోయింది. గత ఎన్నికల్లో జేడీయూ 71 స్థానాల్లో విజయం సాధించగా ప్రస్తుతం 50లోపు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ బిహార్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధించినా జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. ఆయన పార్టీకి సంఖ్యా బలం తగ్గిపోవడంతో ఎన్డీయే గెలిస్తే నితీశ్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారా లేదా అన్నదానిపై నీలినీడలు కమ్ముకున్నాయి. తొలిసారి బీజేపీకి పెద్ద సంఖ్యలో సీట్లు రానున్నాయి.

ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూస్తే నితీశ్ కుమార్ చరిష్మా తక్కువగా ఉంది. తొలిసారి బీజేపీ కంటే తక్కువ స్థానాలుకు పడిపోయారు. అయితే, నితీశ్ బ్రాండ్ తగ్గనప్పటికీ బీహార్‌ ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబిస్తుందని ఆయన సన్నిహితుడొకరు అంగీకరించారు. బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయ్‌వర్గీయ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మోదీ చరిష్మానే గట్టెక్కిస్తోందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, పూర్తిస్థాయి ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని అన్నారు. బిహార్‌ సీఎంగా కొత్తవారిని ప్రతిపాదించే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు ఆయన మాటలను బట్టి అర్ధమవుతోంది. అయితే, ఫలితాలు మారితే నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్యతలు చేపడతారనే వాగ్దానానికి బీజేపీకి కట్టుబడి ఉంటుందని అన్నారు. కోవిడ్ వ్యాప్తికి నితీశ్ కుమార్ బృందం కారణమని ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ తన ఎన్నికలు ప్రచారంలో ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు. జేడీయూ నేత కేసీ త్యాగి మాట్లాడుతూ యువ నేత నితీశ్ ఓటు బ్యాంకును భారీగా చీల్చారని నొక్కి చెప్పారు. ఈసారి ఎవరు సీఎం పదవి చేపట్టనున్నారు వేచిచూడాల్సిందే.

Tags :
|
|

Advertisement