Advertisement

  • హరీష్ రావు ప్రశ్నించాల్సింది బీజేపీని కాదు సీఎం కెసిఆర్ ను ...బిజెపి నేత వివేక్

హరీష్ రావు ప్రశ్నించాల్సింది బీజేపీని కాదు సీఎం కెసిఆర్ ను ...బిజెపి నేత వివేక్

By: Sankar Sat, 31 Oct 2020 3:06 PM

హరీష్ రావు ప్రశ్నించాల్సింది బీజేపీని కాదు సీఎం కెసిఆర్ ను ...బిజెపి నేత వివేక్


తెలంగాణాలో దుబ్బాక ఎన్నికలలో ప్రత్యర్ధులు ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు..అధికార తెరాస , బిజెపి , కాంగ్రెస్ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి..తెరాస ఏకంగా హరీష్ రావు కె దుబ్బాక బాధ్యతలు అప్పగిస్తే , కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ పర్యటిస్తున్నారు..ఇక బిజెపి తరుపున బడా లీడర్లు అంత ప్రచారంలో నిమగ్నం అయ్యారు..తాజాగా బీజేపీ లీడర్ వివేక్ తెరాస మీద తీవ్ర విమర్శలు చేసారు..

కేసీఆర్ పెద్ద అబద్ధాల కోరు అని బీజేపీ నేత వివేక్ అన్నారు. తెలంగాణ వచ్చాక ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు. కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు వచ్చాయి అని తెలిపారు. నిరుద్యోగ భృతి ఏమైంది.. నిరుద్యోగ భృతిపై హరీశ్ కేసీఆర్ ను ప్రశ్నించాలి అని తెలిపారు. రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు పెంచారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇప్పుడు ఆ కాళేశ్వరం డబ్బులతో దుబ్బాకలో ఓట్లను కొనాలనుకుంటున్నారు అని పేర్కొన్నారు. అయితే ఎన్నికలహామీలపై హరీశ్ కేసీఆర్ ను ప్రశ్నించాలి అన్నారు. కరోనాపై తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆ కరోనా టైంలో సెక్రటేరియట్ ను కూల్చివేశారు. సెక్రటేరియట్ లో ఐసోలేషన్ సెంటర్ పెడ్తే బాగుండేది అని వివేక్ అన్నారు. ఇప్పుడు హరీశ్ రావు ప్రశ్నించాల్సింది బీజేపీని కాదు సీఎం ను అని వివేక్ చెప్పుకొచ్చారు.

Tags :
|
|

Advertisement