Advertisement

  • అవినీతి , అక్రమదారులపైన సర్జికల్ స్ట్రైక్ ...వివరణ ఇచ్చిన బీజేపీ నేత

అవినీతి , అక్రమదారులపైన సర్జికల్ స్ట్రైక్ ...వివరణ ఇచ్చిన బీజేపీ నేత

By: Sankar Fri, 27 Nov 2020 08:30 AM

అవినీతి , అక్రమదారులపైన సర్జికల్ స్ట్రైక్ ...వివరణ ఇచ్చిన బీజేపీ నేత


జీహెచ్ఎంసి ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్ మాట బాగా వినిపిస్తోంది. బండి సంజయ్ ఇటీవలే ఎన్నికల ప్రచారంలో సర్జికల్ స్ట్రైక్ మాటను వాడారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే సర్జికల్ స్ట్రైక్ చేస్తామని అన్నారు.

దీనిపై పెద్ద దుమారమే నడిచింది. తెరాస, ఎంఐఎం పార్టీలు సర్జికల్ స్ట్రైక్ పై మండిపడ్డాయి. సర్జికల్ స్ట్రైక్ పై బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్ చెప్పిన సర్జికల్ స్ట్రైక్ అవినీతిపైనా, అక్రమ పాలనపైనా, చొరబాటుదారులపైన ఉంటుందని అన్నారు. హైదరాబాద్ లో ఉంటూ హైదరాబాద్ తిండి తింటూ హైదరాబాద్ గాలిని పీలుస్తూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేవాళ్లపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని అన్నారు.

తెరాస ప్రభుత్వం విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకునే పార్టీ అని, కాంగ్రెస్ కు ఓటు వేస్తె మురికి కాలువలో వేసినట్టే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పార్టీ అని పొంగులేటి సుధాకర్ విమర్శించారు.

Tags :
|

Advertisement