Advertisement

  • ఎలక్షన్ కమిషన్ పై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ మాజీ చీఫ్ ఇంద్రసేనా రెడ్డి

ఎలక్షన్ కమిషన్ పై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ మాజీ చీఫ్ ఇంద్రసేనా రెడ్డి

By: Sankar Mon, 23 Nov 2020 9:26 PM

ఎలక్షన్ కమిషన్ పై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ మాజీ చీఫ్ ఇంద్రసేనా రెడ్డి


రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని తన అదుపులో పెట్టుకొని అక్రమ మార్గం లో గెలువాలని కేసీఆర్ చూస్తున్నాడు అని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనా రెడ్డి అన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎంఐఎం తో కలిసి అక్రమంగా గెలవాలని చూస్తున్నాడు. ఓటర్ లిస్ట్ లో నుండి లక్షల మంది ఓటర్లను తీసేసి గత ఎన్నికల్లో గెలిచాడు.

కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్ట్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.. ఆ ఓటర్ లిస్ట్ ని గజిబిజి చేసి.. వార్డ్ ల వారిగా ఓటర్ లిస్ట్ ని ప్రింట్ చేశారు. ఎవరి పేరన్న లేనట్టయితే మళ్ళీ నమోదు చేసుకోవాలని చెప్పారు. ఇతర జిల్లాలలో ఉన్న వారిని లక్షల సంఖ్యలో ఓటర్ లిస్ట్ లో చేర్పించారు. ఇప్పటి వరకు పోలింగ్ స్టేషన్ వారిగా ఓటర్ లిస్ట్ ను అభ్యర్థులకు ఇవ్వలేదు.

ఎలక్షన్ కమిషన్ దద్దమ్మలాగా ఉంది.. సీఎం కి అమ్ముడు పోయింది అని పేర్కొన్నారు. దొడ్డిదారి గా సీఎం కి ఎన్నికల కమిషన్ సహకరిస్తుంది. వెంటనే ఓటర్ లిస్ట్ ఇవ్వకపోతే రేపు ఎన్నికల కమిషన్ ముందు ధర్నా చేస్తాం. మా అభ్యర్థులు వెంటనే అధికారులను కలిసి ఓటర్ లిస్ట్ అడగాలి.. ఇవ్వక పోతే రాత పూర్వక రిప్లై తీసుకోవాలి అన్నారు.

Tags :
|

Advertisement