Advertisement

  • జిహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీకి భారీగా పెరిగిన ఓటింగ్ శాతం

జిహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీకి భారీగా పెరిగిన ఓటింగ్ శాతం

By: Sankar Sun, 06 Dec 2020 06:41 AM

జిహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీకి భారీగా పెరిగిన ఓటింగ్ శాతం


గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాలు గెలుచుకున్నా.. గతంతో పోలిస్తే ఓటింగ్‌ శాతం మాత్రం భారీగా తగ్గింది.

బీజేపీ ఓటింగ్‌ శాతం మాత్రం అనూహ్యంగా పెరిగింది. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం 0.28 శాతమే కావడం, టీఆర్‌ఎస్‌ కంటే బీజేపీకి 9,744 ఓట్లు మాత్రమే తక్కువ రావడం గమనార్హం. ఈ ఓట్ల శాతం తేడాతో 55 డివిజన్లను టీఆర్‌ఎస్‌ గెలుచు కోగా, 48 డివిజన్లలో బీజేపీ గెలిచింది. పాత బస్తీలో ఎంఐఎం తన ఓటు బ్యాంకును పదిల పరుచుకుని 18.76% ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌ మాత్రం గతం కంటే తక్కువగా 6.67% ఓట్లకే పరిమితమైందని బ్యాలెట్‌ లెక్కలు చెబుతున్నాయి.

కాగా దుబ్బక ఉపఎన్నికలో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ఈసారి జిహెచ్ఎంసి ఎన్నికల మీద ప్రత్యేక ద్రుష్టి సారించింది కేంద్రం నుండి జెపి నడ్డా , అమిత్ షా , ఇతర రాష్ట్రాల నుండి యూపీ సీఎం యోగి వంటి వారు వచ్చి ప్రచారం చేయడం కూడా బీజేపీ కి బాగానే కలిసి వచ్చింది...ఏది ఏమైనా జిహెచ్ఎంసి ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీ 2023 సార్వత్రిక ఎన్నికలను టార్గెట్ చేసింది అని చెప్పవచు

Tags :
|
|
|

Advertisement