Advertisement

  • మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలపై మండిపడ్డ జెపి నడ్డా

మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలపై మండిపడ్డ జెపి నడ్డా

By: Sankar Mon, 22 June 2020 4:18 PM

మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలపై మండిపడ్డ జెపి నడ్డా



ఇండియా చైనా మధ్య జరిగిన సంఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు అమరులు అవడంతో ప్రతిపక్షాలు అన్ని ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి ..ముఖ్యంగా కాంగ్రెస్ , ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా విమర్శలు చేస్తుంది ..మాజీ ప్రధాని , కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ చైనాతో ఘర్షణలో మరణించిన 20 మంది వీరజవాన్లకు న్యాయం చేయాలని, వారికి ఏ మాత్రం తక్కువ చేసినా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్టేనని పేర్కొన్నాడు

అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా తీవ్రంగా మండిపడ్డాడు మన భద్రతా దళాల స్ధైర్యాన్ని పలుమార్లు నిర్వీర్యం చేసిన పార్టీకి మన్మోహన్‌ సింగ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారని నడ్డా ఎద్దేవా చేశారు. చైనాకు బెంబేలెత్తి 43,000 కిలోమీటర్ల భూభాగాన్ని బీజింగ్‌కు గతంలో అప్పగించారని దుయ్యబట్టారు.

యూపీఏ హయాంలో చైనాతో పోరాడాకుండానే మన భూభాగంపై రాజీపడ్డారని నడ్డా ట్వీట్‌ చేశారు. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో వందలాది కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఆరోపించారు. 2010 నుంచి 2013 మధ్య మన్మోహన్‌ హయాంలో చైనా 600 సార్లు భారత్‌ భూభాగంలోకి చొరబాట్లు సాగించిందని నడ్డా అన్నారు. డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఏ అంశంలో అయినా తన విజ్ఞానాన్ని పంచుకోవచ్చని కానీ ప్రధాని కార్యాలయం బాధ్యతల్లో మాత్రం కాదని చురకలంటించారు. పీఎంఏ ప్రతిష్టను యూపీఏ మసకబార్చిందని విమర్శించారు. డాక్టర్‌ సింగ్‌..కాంగ్రెస్‌ పార్టీలు పదేపదే మన సేనలను అవమానించడం మానుకోవాలని హితవుపలికారు.


Tags :
|
|

Advertisement