Advertisement

  • 'గరం గరం' న్యూస్ తీసుకువస్తున్న బిత్తిరి సత్తి

'గరం గరం' న్యూస్ తీసుకువస్తున్న బిత్తిరి సత్తి

By: Sankar Mon, 27 July 2020 09:47 AM

'గరం గరం' న్యూస్ తీసుకువస్తున్న బిత్తిరి సత్తి



బిత్తిరి సత్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు ..ఒక ప్రత్యేక మేనరిజంతో ఎంతో మంది అభిమానులను సంపాదించాడు ..అయితే ఇటీవల కాలంలో వరుసగా చానెల్స్ మారుస్తున్న సత్తి ప్రస్తుతం సాక్షి టివి లో జాయిన్ అయ్యారు ..ఇటీవల సాక్షి టివి బిత్తిరి సత్తి జాయిన్ అయినట్లు రిలీజ్ చేసిన ప్రోమో కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది ..

ఇక ఇప్పుడు సాక్షి టీవీ ద్వారా ‘గరం గరం వార్తలు’ ప్రోగ్రాంతో మన ముందుకు రానున్నాడు. ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు తిరిగి ఉదయం మళ్లీ అదే సమయానికి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమోకు సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

సత్తి స్టైల్లో అదిరిపోయేలా ఉన్న వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. బిత్తిరి సత్తి, సాక్షి టీవీకి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ.. ‘గరం గరం వార్తలు’ పెద్ద హిట్‌ కావాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా సాక్షి టీవీలోకి సత్తి ఆగమనాన్ని సెలబ్రేట్‌ చేస్తూ విడుదల చేసిన తొలి ప్రోమోకు కూడా మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.

Tags :
|

Advertisement