Advertisement

  • కేటీఆర్ బర్త్ డే విషెస్ తో మారుమోగుతున్న సోషల్ మీడియా ..

కేటీఆర్ బర్త్ డే విషెస్ తో మారుమోగుతున్న సోషల్ మీడియా ..

By: Sankar Fri, 24 July 2020 10:35 AM

కేటీఆర్ బర్త్ డే విషెస్ తో మారుమోగుతున్న సోషల్ మీడియా ..



తెరాస వర్కింగ్ ప్రెసిండెంట్ , ఐటి శాఖ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ..సోషల్‌ మీడియా వేదికగా ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతున్నారు..టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు డియర్‌ తారక్‌‌. ప్రజలకు సేవ చేయడానికి మరింత శక్తితో ముందుకు సాగాలి’ అంటూ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశారు..

రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్‌ రావు, రాజ్యసభ సభ్యడు జోగినపల్లి సంతోష్‌ ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే అన్నయ్య. మరెన్నో ఏండ్లు ప్రజాసేవలో కొనసాగాలి. మరిన్ని పెద్ద పదవులను చేపట్టాలి. మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉండాలి. మీరొక ఐకాన్‌. సమకాలీన రాజకీయాల్లో రెండో స్థానానికి నా సోదరుడు తప్ప మరెవరూ సాటిరారని చెప్పడానికి గర్వంగా ఉంది. చిన్నప్పుడు నీతో గడిపిన రోజులు మధురమైన జ్ఞాపకాలు’ అని సంతోష్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో దిగిన చిన్ననాటి ఫొటోను సోషల్‌ మీడియాతో‌ పంచుకున్నారు.

కాగా కేటీఆర్‌ ఈరోజుతో 44వ ఏట అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అభిమానుల ట్వీట్లతో సామాజిక మాధ్యమాలు మారుమోగుతున్నాయి.కెసిఆర్ తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన కేటీఆర్ ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు

Tags :
|
|
|

Advertisement