Advertisement

  • బర్డ్ ఫ్లూ విజృంభన, 25వేల కోళ్లను చంపాలని సర్కార్ ఆదేశం...!

బర్డ్ ఫ్లూ విజృంభన, 25వేల కోళ్లను చంపాలని సర్కార్ ఆదేశం...!

By: Anji Tue, 17 Nov 2020 08:35 AM

బర్డ్ ఫ్లూ విజృంభన, 25వేల కోళ్లను చంపాలని సర్కార్ ఆదేశం...!

కరోనా వైరస్‌తో ప్రస్తుతం అతలాకుతలం అవుతుండగా.. డెన్మార్కు దేశంలో కొత్తగా బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. మధ్య జట్లాండ్‌లోని ట్రస్ట్ రప్ దగ్గర్లోని రాండర్సు పట్టణంలోని కోళ్లలో హెచ్5 ఎన్8 బర్డ్ ఫ్లూ సోకిందని సీరం ఇన్‌స్టిట్యూట్ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది.

దీంతో డెన్మార్కు దేశంలో బర్డ్ ఫ్లూ ప్రబలకుండా నివారించేందుకు 25వేల కోళ్లను చంపాలని ఆ దేశ వ్యవసాయ మంత్రిత్వశాఖ, పశుసంవర్ధక, ఆహార శాఖ ఆదేశించింది. ఈ విషయాన్ని ఆ దేశ వెటర్నరీ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం తెలిపింది.

బర్డ్ ఫ్లూ ప్రబలిన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతంలో పక్షులు, పౌల్ట్రీలను పర్యవేక్షించడానికి 10 కిలోమీటర్ల దూరంతో రెండు రిస్ట్రిక్షన్ జోన్లను ఏర్పాటు చేశారు. 10కిలోమీటర్ల దూరంలో కోళ్లను దూరంగా ఉంచి బర్డ్ ఫ్లూను నిరోధించాలని చర్యలు ప్రారంభించారు.

ఈ నెల ప్రారంభంలో, జట్లాండ్ ప్రాంతంలోని అడవి పక్షులలో బర్డ్ ఫ్లూ కనుగొన్నారు. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) యొక్క H5N8 జాతి వైరస్ ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్‌తో సహా ఐరోపాలోని వివిధ ప్రాంతాలకు విస్తరించి అలజడి రేపుతోంది.

బాస్టియాకు సమీపంలో ఉన్న ఒక ఉద్యానవన కేంద్రం పెంపుడు జంతువుల విభాగంలో హాట్-కోర్స్ (అప్పర్ కార్సికా) లో అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కేసు నిర్ధారించబడిందని ఫ్రెంచ్ వ్యవసాయ, ఆహార మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఈ ప్లూ ఇంతవరకు ఎక్కడా మనషులకు సోకినట్టు నిర్దారణ కాలేదు.

Tags :

Advertisement