Advertisement

  • కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ పాత్రే కీలకం ..బిల్ గేట్స్

కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ పాత్రే కీలకం ..బిల్ గేట్స్

By: Sankar Tue, 15 Sept 2020 8:18 PM

కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ పాత్రే కీలకం ..బిల్ గేట్స్


కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచానికి అందించే సత్తా భారత్‌కు మాత్రమే ఉందని గతంలో ప్రకటించిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్.. మరోసారి అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు బిల్‌గేట్స్. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ముందంజలో ఉన్న భారత్ సహకారాన్ని తాము ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు.

బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్న బిల్ గేట్స్.. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి చాలా వ్యాక్సిన్ క్యాండిడేట్లు తుది ప్రయోగ దశకు చేరుకుంటాయన్నారు.. వచ్చే ఏడాది భారత్‌లో భారీ మొత్తంలో కోవిడ్ వ్యాక్సిన్‌ ఉత్పత్తయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

భారత ఫార్మా సంస్థలు కేవలం ఇండియాకు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి సరిపడేలా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగలవని గతంలో వ్యాఖ్యానించిన బిల్‌గేట్స్.. ఇప్పుడు.. వ్యాక్సిన్ సురక్షితం, సమర్థవంతంగా పని చేస్తుందని తేలిన తర్వాత భారత్‌లో వ్యాక్సిన్ సత్వరమే అందుబాటులోకి రావాలని తాను కోరుకుంటున్నానన్నారు. భారత్‌లో ఉత్పత్తయ్యే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చెందుతోన్న దేశాలకు సరఫరా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 38వ్యాక్సిన్‌లు మానవ ప్రయోగ దశలో ఉండగా, మరో 93వ్యాక్సిన్‌లు ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నట్లు వెల్లడించారు బిల్‌ గేట్స్. కాగా, ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగా... అమెరికా వ్యాక్సిన్‌కు డెడ్‌లైన్ పెట్టారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోవైపు.. భారత్‌లోనూ కరోనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.

Tags :
|
|

Advertisement