Advertisement

  • కరోనా వైరస్, వ్యాక్సిన్‌పై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు...

కరోనా వైరస్, వ్యాక్సిన్‌పై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు...

By: chandrasekar Wed, 09 Dec 2020 5:50 PM

కరోనా వైరస్, వ్యాక్సిన్‌పై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు...


మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాక్సిన్ ‌ను అభివృద్ధి చేసే సాంకేతికత వేగవంతమైందని అభిప్రాయ౦ వ్యక్తం చేసారు. 2021 మార్చికి కరోనా వైరస్ కు 6 రకాల టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2022 నాటికి కరోనా వైరస్ పూర్తిగా అంతమైయే అవకాశం కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి తీవ్ర సంక్షోభాన్ని కలిగించినప్పటికీ రిమోట్‌ లెర్నింగ్‌, టెలీ మెడిసిన్‌, డిజిటల్‌ ఫైనాన్స్ లాంటి రంగాల్లో ఎంతో పురోగతి సాధించామని బిల్‌ గేట్స్‌ అన్నారు.

పేద, ధనిక దేశాల మధ్య కరోనా వ్యాక్సిన్ కారణంగా ఘర్షణలు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని దేశాలకు సమానంగా వ్యాక్సిన్‌ అందేలా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మంగళవారం సింగపూర్‌లో జరిగిన ఫిన్‌టెక్‌ సమావేశాన్ని ఉద్దేశించి బిల్‌ గేట్స్‌ వర్చువల్‌గా మాట్లాడుతూ కరోనా వైరస్, టీకా గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండియా అవలంభిస్తున్న విధానాలను ప్రశంసించారు. డిజిటల్‌ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో భారత్‌ అద్భుతమైన పద్ధతులను పాటిస్తోందని ప్రశంసించారు.

Tags :
|

Advertisement