Advertisement

బిల్ గేట్స్ ఇంట విషాదం..!

By: Anji Wed, 16 Sept 2020 4:44 PM

బిల్ గేట్స్ ఇంట విషాదం..!

ప్రపంచ కుబేరుల్లో ఒకరు.. గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంట విషాదం చోటుచేసుకుంది. బిల్ గేట్స్ నాన్న చనిపోయారు. ఈయన పేరు విలియన్ హెచ్ గేట్స్ 2. న్యాయవాదిగా, దాతృత్వపరుడిగా కన్నా బిల్ గేట్స్ తండ్రిగానే ఈయనకు ఎక్కువ గుర్తింపు లభించిందనడంలో అతిశయోక్తి లేదేమో.

విలియమ్ హెచ్ గేట్స్ 2 వాషింగ్టన్‌లోని తన ఇంట్లో కన్నుమూశారు. ఈయన వయసు 94 ఏళ్లు. అల్జీమర్స్ వ్యాధి కారణంగా ఈయన మరణించారు. విలియన్ హెచ్ గేట్స్ మరణాన్ని కుటుంబ సభ్యులు మంగళవారం ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్యం లక్ష్యంగా ఏర్పాటైన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపనకు ఈయన చేసి కృషి ఎవ్వరూ మరువలేరని చెప్పుకోవచ్చు.

బిల్ గేట్స్ నాన్న మరణాన్ని తట్టుకోలేక ఆయనను తలచుకుంటూ ఒక ట్వీట్ చేశారు. ‘మా నాన్న నిజమైన బిల్ గేట్స్. ఇప్పుడు ఆయనను ప్రతి రోజు మిస్ అవుతా’ అని భావోద్వేగమైన ట్వీట్ చేశారు.

Tags :

Advertisement