Advertisement

  • కరోనా మహమ్మారిని నేను సృష్టించలేదు ..బిల్ గేట్స్

కరోనా మహమ్మారిని నేను సృష్టించలేదు ..బిల్ గేట్స్

By: Sankar Fri, 24 July 2020 4:29 PM

కరోనా మహమ్మారిని నేను సృష్టించలేదు ..బిల్ గేట్స్



కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంది ..ఇటీవల కాలంలో ఒక వ్యాధి వలన ప్రపంచం మొత్తం లాక్ డౌన్ విదించుకొని ఉండటం ఇదే తొలిసారి ..చైనాలో పుట్టిన ఈ కరోనా వ్యాధి వలన అగ్ర రాజ్యం అమెరికా , ఇండియా , బ్రెజిల్ లు బాగా దెబ్బతిన్నాయి ..అయితే వాక్సిన్ తయారు చేసి డబ్బులు సంపాదించడం కోసమే బిల్ గేట్స్ ఈ కరోనా వ్యాధిని సృష్టించదని అనేక వార్తలు వచ్చాయి..అయితే ఆ వ్యాఖ్యలపై తాజాగా బిల్ గేట్స్ స్పందించాడు ..

ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఆయ‌న ఖండించారు. సులువైన కార‌ణాలు వెతుకుతున్న ప్ర‌జ‌లు.. సోష‌ల్ మీడియాను ఆధారం చేసుకుని .. క‌రోనా మ‌హ‌మ్మారిపై క‌థ‌న‌లు క్రియేట్ చేస్తున్నార‌ని సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బిల్ గేట్స్ అభిప్రాయ‌ప‌డ్డారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు, న‌కిలీ వార్త‌ల‌ను .. మ‌హ‌మ్మారి మొద‌లైన క్ష‌ణం నుంచి గేట్స్‌ను టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్ర‌జ‌ల జీవితాల‌ను ర‌క్షించేందుకు త‌మ ఫౌండేష‌న్.. వ్యాక్సిన్ సంస్థ‌ల‌కు అధిక మొత్తంలో నిధుల‌ను అందించిన‌ట్లు గేట్స్ తెలిపారు. డబ్బ‌లు సంపాదిస్తున్నాం కాబ‌ట్టి, వ్యాక్సిన్లు త‌యారు చేసి.. మేమే ప్ర‌జ‌ల్ని చంపుతున్నామ‌ని మీరంటున్నారా అంటూ గేట్స్ ఆరోపించారు.

క‌రోనా సంక్షోభం మొద‌లైన నాటి నుంచి బిల్ గేట్స్ పై ఆరోప‌ణ‌లు కొన‌సాగుతున్నాయి. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాల్లో.. వివిధ భాష‌ల్లోనూ అనేక క‌థ‌నాలు ప్ర‌చురితం అయ్యాయి. వ్యాక్సిన్ త‌యారీ కోసం వైర‌స్‌ను గేట్స్ పుట్టించిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేశారు. బ‌యోలాజిక‌ల్ టెర్ర‌రిజం కేసులో గేట్స్‌ను ఎఫ్‌బీఐ అరెస్టు చేసిన‌ట్లు కూడా కొన్ని పోస్టులు సోష‌ల్ మీడియాలో క‌నిపించాయి. వ్యాక్సిన్ త‌యారీ నుంచి డ‌బ్బు సంపాదించేందుకు గేట్స్ వైర‌స్‌ను సృష్టించిన‌ట్లు కొంద‌రు ఆరోపించారు..

Tags :
|
|

Advertisement