Advertisement

  • కరోనా మహమ్మారి తీవ్రతపై కీలక వ్యాఖ్యలు చేసిన బిల్ గేట్స్

కరోనా మహమ్మారి తీవ్రతపై కీలక వ్యాఖ్యలు చేసిన బిల్ గేట్స్

By: Sankar Mon, 14 Dec 2020 2:18 PM

కరోనా మహమ్మారి తీవ్రతపై కీలక వ్యాఖ్యలు చేసిన బిల్ గేట్స్


కరోనా మహమ్మారి గత ఏడాది నుంచి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే..అయితే గత కొంతకాలంగా కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా కొంత తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నాయి...అయితే వచ్చే ఆరునెలల్లో కరోనా వ్యాధి మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది అని అంటున్నాడు దిగ్గజ బిసినెస్ మాన్ బిల్ గేట్స్ ..

ఆదివారం అయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే నాలుగు నుంచి ఆరు నెలల్లో కోవిడ్ మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని బిల్‌గేట్ సూచించారు. అయితే, కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే వైరస్ ముప్పును అరికట్టవచ్చని అన్నారు.

విచారకరమైన విషయమేంటంటే.. వచ్చే 4-6 నెలల్లో కరోనా ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ అంచనాల ప్రకారం మరో 2 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉంది... అయితే మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటిస్తే ఈ మరణాల శాతాన్ని తగ్గించవచ్చు’ అని అన్నారు.

Tags :

Advertisement