Advertisement

  • సుశాంత్ కేసులో సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్నికోరిన బీహార్

సుశాంత్ కేసులో సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్నికోరిన బీహార్

By: chandrasekar Wed, 05 Aug 2020 8:44 PM

సుశాంత్ కేసులో సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్నికోరిన బీహార్


బీహార్ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్నికోరింది. సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్‌ బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను క‌లిసి సుశాంత్ మృతి కేసులో సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని కేకేసింగ్ బీహార్ సీఎంను కోరిన‌ట్లు తెలిసింది. ముంబైలోని బాంద్రాలోని త‌న ఇంట్లో సుశాంత్ జూన్ 14వ తేదీన ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే అత‌ని మ‌ర‌ణంపై మిస్ట‌రీ నెల‌కొన్న‌ది. దీంతో గ‌త 50 రోజుల నుంచి సుశాంత్ కేసు మీడియాలో అనేక క‌థ‌నాల‌కు రూపం పోసింది.

సుశాంత్ మృతి కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని కేంద్రానికి ప్ర‌తిపాద‌న చేసిన‌ట్లు జేడీయూ ప్ర‌తినిధి సంజ‌య్ సింగ్ తెలిపారు. కుటుంబ‌స‌భ్యులు కోరిన నేప‌థ్యంలో సుశాంత్ మృతి కేసులో సీబీఐ విచార‌ణకు సిఫార‌సు ప్ర‌తిపాద‌న చేస్తున్న‌ట్లు ఓ మీడియాతో సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ముంబై పోలీసులు సుశాంత్ కేసులో ఎటువంటి ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌క‌పోవ‌డంతో బీహార్ పోలీసులు పాట్నాలో ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. విచార‌ణ నిమిత్తం పాట్నా పోలీసులు ముంబైలో ద‌ర్యాప్తు కూడా మొద‌లుపెట్టారు.

సుశాంత్ అకౌంట్లో ఉన్న 15 కోట్ల డ‌బ్బును ఎవ‌రు విత్‌డ్రా చేశార‌న్న కోణంలో విచార‌ణ జ‌రుగుతున్న‌ది. గ‌ర్ల్‌ఫ్రెండ్ రియాపై అనేక అనుమానాలు వస్తున్నాయి. త‌న కుమారుడిని రియా చంపిన‌ట్లు సుశాంత్ తండ్రి కృష్ణ‌కుమార్ ఆరోపించారు. ముంబై పోలీసులు మాత్రం సుశాంత్‌ది ఆత్మ‌హ‌త్యే అని చెబుతున్నారు. సుశాంత్‌కు బైపోలార్ డిజార్డ‌ర్ ఉన్న‌ద‌ని, అత‌ను మానసిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డిన‌ట్లు ముంబై పోలీసు క‌మిష‌న‌ర్ ప‌ర‌మ్‌బీర్ సింగ్ తెలియచేసారు. ఇక రెండు రోజుల క్రితం విచార‌ణ కోసం ముంబై వెళ్లిన బీహార్ ఐపీఎస్ ఆఫీస‌ర్ విన‌య్ తివారీని క్వారెంటైన్ చేశారు. దీంతో ముంబై పోలీసుల తీరు ప‌ట్ల అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. లాయ‌ర్ వికాస్ సింగ్ నేతృత్వంలో సుశాంత్ తండ్రి ఇవాళ సీఎం నితీశ్‌ను క‌లిశారు.

Tags :
|
|
|
|

Advertisement