Advertisement

  • బీహార్ లో ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్

బీహార్ లో ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్

By: Sankar Wed, 04 Nov 2020 07:42 AM

బీహార్ లో ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఇందులో 54.64 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని ఎలక్షన్‌ కమిషన్‌ చెప్పింది. రెండు దశల్లో కలిపి 53.79 ఓటింగ్‌ శాతానికి పైగా నమోదైనట్లు తెలిపింది.

మంగళవారం జరిగిన ఈ పోలింగ్‌లో దాదాపు 2.85 కోట్ల ఓటర్లలో సగానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గవర్నర్‌ ఫగు చౌహాన్, సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 17 జిల్లాల్లో 94 సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరిగాయి. ఎలక్షన్‌ కమిషన్‌ ఓటర్‌ టర్నౌట్‌ యాప్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ముజఫర్‌çపూర్‌లో అత్యధికంగా 54.89 శాతం ఓట్లు పోలయ్యాయి.

హార్లఖి నియోజకవర్గంలో ప్రచారసభలో సీఎం నితీశ్‌ ప్రసంగిస్తుండగా కొందరు వ్యక్తులు పెరిగిన ఉల్లి ధరలపై నిరసనగా ఆయనపై ఉల్లిపాయలు విసిరారు. అయితే అవి నితీశ్‌పైకి రాకముందే నేలపై పడ్డాయి. భద్రతా బలగాలు వారిని పట్టుకోబోతుండగా నితీశ్‌ వారించారు.

Tags :
|
|

Advertisement