Advertisement

  • కరోనా విజృంభణతో ఆ రాష్ట్రంలో సెప్టెంబర్ 6 వరకు లాక్ డౌన్

కరోనా విజృంభణతో ఆ రాష్ట్రంలో సెప్టెంబర్ 6 వరకు లాక్ డౌన్

By: Sankar Mon, 17 Aug 2020 6:41 PM

కరోనా విజృంభణతో ఆ రాష్ట్రంలో సెప్టెంబర్ 6 వరకు లాక్ డౌన్


బీహార్ లో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వం మరొక సారి లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకుంది.. సెప్టెంబర్ 6 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రకటించింది.

ఈ మేరకు నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. బిహార్‌లో కరోనా స్థితిగతులు, లాక్‌డౌన్ అంశాలపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ నేతృత్వంలో సోమవారం (ఆగస్టు 17) ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కరోనా కట్టడి దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన అన్ని కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో కార్యకలాపాలు సాగిస్తాయని తాజా ఉత్తర్వుల్లో బిహార్ ప్రభుత్వం పేర్కొంది. రైలు, విమాన సేవలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, మతపరమైన ప్రదేశాలు, బస్సు సర్వీసులు, పార్క్‌లు, జిమ్ములు మూసే ఉంటాయని తెలిపింది.

బిహార్‌లో విధించిన లాక్‌డౌన్ ముగిసిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,03,283కి చేరింది. ఆదివారం కొత్తగా 3,814 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.



Tags :
|

Advertisement