Advertisement

  • బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల ..కరోనా వచ్చిన ఓటువేసే అవకాశం

బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల ..కరోనా వచ్చిన ఓటువేసే అవకాశం

By: Sankar Fri, 25 Sept 2020 3:08 PM

బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల ..కరోనా వచ్చిన ఓటువేసే అవకాశం


బీహార్ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. చీఫ్ ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా మీడియాతో మాట్లాడుతూ..నెలలు గడుస్తున్నా “కోవిడ్” నుంచి ఉపశమనం లేదు... ప్రజారోగ్యంతో పాటు ప్రజాస్వామ్య హక్కులను కూడా కాపాడుకోవాలన్నారు.

“కోవిడ్-19” మహమ్మారి జనజీవనంలో సాధారణం అయిపోయింది...ఎన్నికలను సరికొత్త ఆరోగ్యభద్రత ప్రమాణాల మధ్య నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 29తో బిహార్ అసెంబ్లీ ముగియనున్నదని పేర్కొన్నారు. 243 సీట్లున్న అసెంబ్లీలో 38 సీట్లు ఎస్సీ-ఎస్టీ రిజర్వుడు స్థానాలున్నాయని... “కోవిడ్” జాగ్రత్తల్లో భాగంగా 7 లక్షల హ్యాండ్ శానిటైజర్లు, 46 లక్షల మాస్కులు, 6 లక్షల పీపీఈ కిట్లు, 6.7 లక్షల ఫేస్ షీల్డులు, 23 లక్షల హ్యాండ్ గ్లౌజులు సమీకరించామని తెలిపారు.

ఓటర్లు ఒకసారి ఉపయోగించి పడేసేందుకు 7.2 కోట్ల చేతి గ్లౌజులు ఏర్పాటు చేశామన్నారు. ఆన్‌లైన్ పద్ధతుల్లోనే నామినేషన్లు నిర్వహిస్తామని వెల్లడించారు. “కోవిడ్” అనుమానిత ఓటర్లు చివర్లో ఓటేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసామని తెలియజేశారు. కరోనా వచ్చిన వారికి చివరి రోజు ఓటేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని అరోరా పేర్కొన్నారు. వైద్యాధికారుల పర్యవేక్షణలో ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేసామన్నారు. 80 ఏళ్లు పైబడినవారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించామని తెలిపారు.

Tags :
|

Advertisement