Advertisement

  • బీహార్ ఎన్నికలు ...కరోనా తో మృతి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి

బీహార్ ఎన్నికలు ...కరోనా తో మృతి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి

By: Sankar Sun, 08 Nov 2020 07:21 AM

బీహార్ ఎన్నికలు ...కరోనా తో మృతి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి


బీహార్‌లో తుది విడత పోలింగ్ జరుగుతున్న వేళ.. ఊహించని విషాదం చోటు చేసుకుంది. మధుబనిలోని బెనిపట్టి అసెంబ్లీ సీటు నుంచి బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి నీరజ్ ఝా కరోనా వైరస్ కారణంగా మరణించారు. గత కొద్ది రోజులుగా నీరజ్ ఝా కరోనా బారిన పడ్డాడు.

ఆయన పాట్నా ఎయిమ్స్‌లో చికిత్స నిమిత్తం చేరారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నీరజ్ ఝా కన్నుమూశారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నీరజ్ ఝా.. నిజానికి జేడీయూ నేత.. కానీ, ఎన్నికలకు ముందు పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో ఇండిపెండెంట్‌గా ఎన్నికల బరిలోకి దిగారు . మీడియా నివేదికల ప్రకారం, ఎన్నికల పోటీలోకి దిగిన రోజున స్వతంత్ర అభ్యర్థి నీరజ్ ఝా అనారోగ్యంతో ఉన్నారు.

కానీ, ఆయన మందులను వేసుకుంటూ ప్రచారం కొనసాగించాడు. ఆరోగ్యం క్షీణించినందుకు పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత చికిత్స కోసం మధుబనికి మొదట తీసుకువచ్చారు. ఆయన పరిస్థితి విషమంగా మారటంతో పాట్నా ఎయిమ్స్‌లో చేర్చారు. చివరకు ఆయన నేడు తుది శ్వాస విడిచారు .

Tags :
|
|

Advertisement