Advertisement

  • నేడే బీహార్ తొలి విడత పోలింగ్...బరిలో 1006 మంది అభ్యర్థులు

నేడే బీహార్ తొలి విడత పోలింగ్...బరిలో 1006 మంది అభ్యర్థులు

By: Sankar Wed, 28 Oct 2020 07:47 AM

నేడే బీహార్ తొలి విడత పోలింగ్...బరిలో 1006 మంది అభ్యర్థులు


కరోనా లాక్ డౌన్ తరువాత దేశంలో తొలిసారిగా బీహార్ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. తొలివిడతగా నేడు 71 స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 71 స్థానాల్లో 1066 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

రెండు కోట్లమందికి పైగా ఓటర్లు తొలివిడతలో ఓటుహక్కు వినియోగించుకోబోతున్నారు. సురక్షితమైన పోలింగ్ జరిగేలా చూసేందుకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక్కో పోలింగ్ బూత్ లో గరిష్టంగా ఓటర్ల సంఖ్యను 1600 నుంచి 1000 కి తగ్గించింది.

అలానే పోలింగ్ సమయాన్ని పెంచడం, కరోనా పాజిటివ్ గా నిర్ధారించబడిన వారికి, 80 సంవత్సరాల పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించడం చేస్తున్నారు. బీహార్ లో ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తే, మిగతా రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది.

Tags :
|
|

Advertisement